English | Telugu
షాకింగ్ న్యూస్..ఛార్మి పెళ్లి ఈ రోజే !!
Updated : Apr 7, 2015
టాలీవుడ్ నటి ఛార్మి ఈమధ్య జనాలకి ట్విట్టర్ ద్వారా షాక్ ల మీద షాకులిస్తోంది. కొద్ది రోజుల క్రితం 'అయాం ఇన్ లవ్’ అని ట్విట్ చేసిన ఛార్మి..లేటెస్ట్ గా 'ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాను' అని ట్విట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ గురి అయ్యారు. మూడు రోజుల క్రితం లవ్ లో పడ్డానని చెప్పిన ఛార్మి అప్పుడే పెళ్ళి చేసుకోవడం ఏమిటని ఆరా తీయడం మొదలుపెట్టారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఛార్మి ప్రస్తుతం ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ లో జరుతున్న విషయాలను ఇలా ట్విట్టర్ లో తెలియజేస్తూ లవ్ లో పడ్డానని, పెళ్లి చేసుకుంటున్నానని షార్ట్ కట్ లో పోస్ట్ చేసిందట. వెర్రి వెయ్యి రకాల౦టే ఇదే మరి.