English | Telugu
జగపతిబాబును ఒక్కరూ గుర్తు పట్టలేదా.. ఇది మరీ దారుణం కదా!
Updated : Apr 12, 2025
మనదేశంలో సినిమా ఆర్టిస్టులకు, క్రికెట్ ప్లేయర్లకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమా స్టార్స్ ఏదైనా ఫంక్షన్‌కి లేదా షూటింగ్ కోసం ఔట్‌డోర్‌కి వెళ్లినపుడు అభిమానుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆయా ఆర్టిస్టులతో మాట్లాడాలని, సెల్ఫీలు తీసుకోవాలని జనం ఎగబడుతుంటారు. సర్వసాధారణంగా ఏ ఆర్టిస్టుకైనా ఇదే జరుగుతుంది. కానీ, మన జగపతిబాబుకి మరో విధంగా జరిగింది. హైదరాబాద్‌లోని కొన్ని వీధుల్లో ఒక్కడే నడుచుకుంటూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఆయన్ని షాక్‌కి గురి చేసింది. ఆ వీడియో చూస్తే జగపతిబాబే కాదు, మనం కూడా షాక్ అవ్వడం ఖాయం. దాదాపు 35 సంవత్సరాలుగా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 200 సినిమాల్లో నటించారు జగపతిబాబు.
ఇటీవల హైదరాబాద్‌లోని వీధుల్లో జగపతిబాబు ఒంటరిగా నడుచుకుంటూ ఒక మొబైల్ షాప్‌కి వెళ్లారు. ఇదంతా ఆయన సిబ్బంది వీడియో తీస్తూ అనుసరించారు. అలా వీడియో తీస్తున్నంత సేపూ ఒక్కరు కూడా జగపతిబాబును గుర్తు పట్టి పలకరించలేదు. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. అలాంటి జగ్గుభాయ్ ఒక కామన్ మ్యాన్‌లా వీధుల్లో కనిపించేసరికి.. ఎవరో జగపతిబాబును పోలిన మనిషి అనుకున్నారు తప్ప ఎవరూ దగ్గరకు రాలేదు. తాజాగా తీసిన ఈ వీడియోను స్వయంగా జగ్గుభాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో బాగా వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒక స్టార్ యాక్టర్ అయి ఉండి ఇంత సింపుల్‌గా ఉండడం ఎలా సాధ్యం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.