English | Telugu
టాలీవుడ్ లో విషాదం.. కమెడియన్ అల్లు రమేష్ కన్నుమూత!
Updated : Apr 18, 2023
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నటుడు అల్లు రమేష్ కన్నుమూశారు. 53 ఏళ్ళ రమేష్ మంగళవారం నాడు విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన రమేష్.. 'నెపోలియన్', 'మధుర వైన్స్', 'తోలుబొమ్మలాట', 'రావణ దేశం' వంటి సినిమాల్లో నటించారు. ఇక యూట్యూబ్ లో ప్రసారమయ్యే 'మా విడాకులు' సిరీస్ తో ఆయన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అందులో హీరోయిన్ గా తండ్రిగా నటించి నవ్వులు పంచారు. నటుడిగా రాణిస్తున్న ఆయన గుండెపోటుతో అర్థాంతరంగా లోకాన్ని విడిచారు.