English | Telugu

అటు బాబాయ్.. ఇటు అబ్బాయ్...

నందమూరి ఫ్యామిలీకి దగ్గరగా ఉండే యంగ్ హీరోలలో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ యంగ్ హీరోలు అటు బాబాయ్ బాలకృష్ణ (Balakrishna), ఇటు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. ఇద్దరితో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుండటం విశేషం.

బాలకృష్ణ హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ షోకి సిద్ధు, విశ్వక్ గెస్ట్ లుగా హాజరయ్యారు. అప్పటినుంచి ఈ ఇద్దరు బాలయ్యతో ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనతో కలిసి పలు వేదికలను పంచుకున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన విరాళం చెక్ లను సీఎం చంద్రబాబుకి అందించడానికి కూడా.. బాలకృష్ణతో కలిసి సిద్ధు, విశ్వక్ వెళ్ళారు. వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ బాలయ్య వారితో బాగా కలిసిపోయారు. ఇద్దరు యంగ్ హీరోలతో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సిద్ధు, విశ్వక్ లకు మంచి అనుబంధముంది. సిద్ధు, విశ్వక్ ల సినిమాల ఎంపికను, వారి ప్రయాణాన్ని మెచ్చుకునే ఎన్టీఆర్.. మొదటి నుంచి వారికి మోరల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఇరువురి సినిమాల వేడుకలకు హాజరై.. వారికి తన వంతుగా సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే ఎన్టీఆర్ ను సిద్ధు, విశ్వక్ లు ఒక బ్రదర్ లా ఫీలవుతారు. ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్ తాజా మూవీ 'దేవర' ప్రమోషన్స్ లో వీరు భాగమవుతున్నారు.

'దేవర' చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కోసం సిద్ధు, విశ్వక్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరు కలిసి ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ చేయబోతున్నారని సమాచారం.

అంతేకాదు, రీసెంట్ గా విడుదలైన 'దేవర' ట్రైలర్ పై ఒక యూట్యూబర్ నెగటివ్ కామెంట్ చేయగా.. విశ్వక్ ఒక హీరోలా కాకుండా, ఎన్టీఆర్ ఫ్యాన్ లా రియాక్ట్ అయ్యాడు. ముందు నీ ఫేస్ చూస్కో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

మొత్తానికి నందమూరి బాబాయ్, అబ్బాయిలతో.. సిద్ధు, విశ్వక్ లకు ఉన్న అనుబంధం.. వారి పట్ల ఈ యువ హీరోలు చూపిస్తున్న అభిమానం చూసి.. నందమూరి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.