Read more!

English | Telugu

రెడ్ డ్రెస్ లో మురిసిపోయిన నటి జ్యోతి...గ్రాండ్ గా బర్త్ డే వేడుకలు

సెలబ్రిటీస్ ఈ మధ్య బర్త్ డేస్ బాగా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బర్త్ డే అనే కాదు, ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, గోరింటాకు పెట్టుకున్నా, కాళ్లకు పట్టీలు కొనుకున్నా ప్రతీ ఇన్సిడెంట్ ని ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బోల్డ్ బ్యూటీ లేడీ జ్యోతి తన పుట్టినరోజును అంతే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ పేరు తెచ్చుకున్న  జ్యోతి  బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది..మత్తెక్కించే చూపులతో, తనకే సొంతమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

ప్రస్తుతం మూవీస్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈమె తన పుట్టినరోజును గ్రాండ్ గా చేసుకుంది. ఈ సందర్భంగా  రెడ్ గౌన్ లో జ్యోతి తళతళ మెరిసిపోయింది. ఇక ఈమె పుట్టినరోజు వేడుకలకు పలువురు డైరెక్టర్స్, ఆర్టిస్టులు  వచ్చి విష్ చేశారు. సెలెబ్రేషన్స్ కి  సంబంధించిన ఫొటోల్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.