English | Telugu

యష్ పనికి అందరు షాక్..ఇంక కేజీఎఫ్ మర్చిపోండి

విక్టరీ వెంకటేష్ (venkatesh)హీరోగా వచ్చిన మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. అభిమాని లేనిదే హీరోలు లేరులే అని. ఇది అక్షరాల నిజం. అభిమాని లేనిదే హీరోలు లేరు. నేషనల్ స్టార్ యష్ (yash)విషయంలో ఇది మరో సారి నిరూపితమైంది. పైగా సోషల్ మీడియా కూడా షేక్ అవుతుంది. అసలు విషయం ఏంటో చూద్దాం.

ఏబిసిడి ల వరుస క్రమాన్నిమర్చిపోయేలా చేసిన మూవీ కేజిఎఫ్(kgf)చాప్టర్ 1 అండ్ కేజిఎఫ్ చాఫ్టర్ 2 . 2018 , 2022 లో రిలీజ్ అయ్యాయి. వాటి తర్వాత యష్ సినిమా ఏది ఇంతవరకి రాలేదు. దీంతో అభిమానులు యష్ కొత్త మూవీ ప్రకటన కోసం ఎంతగానో వెయిట్ చేసారు. ఇక వాళ్ళందరిలో సంతోషాన్ని నింపేలా టాక్సిక్(toxic)అనే మూవీని స్టార్ట్ చేసాడు.కొన్ని రోజుల క్రితమే షూటింగ్ కూడా మొదలయ్యింది. కానీ యష్ లుక్ ఎలా ఉంటుందనే విషయాన్నీ మాత్రం రివీల్ చెయ్యలేదు. జనరల్ గా సినిమా స్టార్ట్ చేసేటప్పుడో, లేక కొన్ని రోజుల తర్వాతో ఏ హీరో లుక్స్ అయినా బయటకి వస్తాయి. కానీ యష్ విషయంలో మాత్రం అది జరగలేదు.కేజిఎఫ్ లో యష్ లుక్ ఒక డిఫరెంట్ స్టైల్ తో ఉండి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. పైగా సినిమా విజయంలో కీలక పాత్ర కూడా పోషించింది. దీంతో టాక్సిక్ లో యష్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. పైగా నిత్యం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో యష్ తాజా లుక్ ఒకటి ఆయన అభిమానుల్లో ఆనందాన్ని తెచ్చింది. రీసెంట్ గా యష్ బయట ఒక చోట కనపడ్డాడు. దీంతో కొంత మంది తమ కెమెరాలలో బంధించారు. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. కేజీఎఫ్ స్టైల్ ఆఫ్ గడ్డమే ఉన్నా హెయిర్ స్టైల్ మాత్రం కొత్తగా ఉంది. టోటల్ గా చెప్పాలంటే సూపర్ స్టైలిష్ తో ఉన్నాడు. దీంతో టాక్సిక్ కి ఇదే లుక్ ఇదే అంటు అభిమానులు సందడి చేస్తున్నారు.

ప్రఖ్యాత మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(geetu mohandas) టాక్సిక్ కి దర్శకత్వం వహిస్తుంది.ఈమె నుంచి గతంలో మూతన్, లీర్స్ డైస్, వంటి సినిమాలు వచ్చాయి. అదే విధంగా హీరోయిన్ గాను, క్యారక్టర్ నటిగాను ముపై సినిమాల దాకా చేసింది.మూన్ స్టార్ క్రియేషన్స్ అండ్ కేవీఎన్ ప్రొడక్షన్స్ యష్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.