English | Telugu
థ్యాంక్ గాడ్ విజయ్‌కాంత్ సేఫ్ !!!
Updated : Jul 11, 2014
బుధవారం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన డీఎండీకే అధినేత, తమిళ నటుడు విజయకాంత్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా వున్నట్లు సమాచారం. కానీ ఆయనకు తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. బుధవారం ఆయనకు అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి లేకపోవడం, అధిక పని ఒత్తిడి వలన ఆయనకు ఇలా అస్వస్థతకు గురయ్యారని తేల్చారు. ఈసీజీ, ఎక్స్‌రే, స్కాన్ తదితర పరీక్షల నిర్వహించిన తర్వాత ఆ రోజు రాత్రే ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు తగినంత విశ్రాంతి కావలసి వుండటంతో ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు.