English | Telugu

గర్ల్ ఫ్రెండ్ కు విజయ్ దేవరకొండ గిఫ్ట్!

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నాడు. 'గర్ల్ ఫ్రెండ్' టీంని విజయ్ దేవరకొండ గిఫ్ట్ అందించాడు. టీజర్ ని వాయిస్ ఓవర్ అందించడం కాకుండా, టీజర్ ను తన చేతుల మీదుగా విడుదల చేశాడు. (The Girlfriend Teaser)

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా టీజర్ రిలీజ్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, గర్ల్ ఫ్రెండ్ టీజర్ లోని ప్రతి విజువల్ ఆకట్టుకుంది. ఈ మూవీని చూసేందుకు వెయిట్ చేస్తున్నా. 8 ఏళ్ల క్రిితం రష్మికను సెట్ లో కలిశా. ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నా రష్మిక వ్యక్తిగతంగా ఇప్పటికీ అంతే హంబుల్ గా ఉంది. నటిగా ఆమెకు 'ది గర్ల్ ఫ్రెండ్' మరింత బాధ్యతను ఇచ్చింది. సక్సెస్ ఫుల్ గా రష్మిక ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నా. ప్రతి ప్రేక్షకుడినీ కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టర్ రాహుల్ చూపిస్తాడని నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నాడు.

"ది గర్ల్ ఫ్రెండ్" టీజర్ విషయానికొస్తే.. కాలేజ్ హాస్టల్ లోకి రష్మిక అడుగుపెడుతున్న సీన్ తో టీజర్ మొదలైంది. హీరో దీక్షిత్, రష్మిక క్యారెక్టర్స్ పరిచయం, వారి మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ ను చూపించారు. ఆ కాలేజ్ లో లీడ్ పెయిర్ చేసిన జర్నీ ఎంతో ఎమోషనల్ గా ఉంది. "నయనం నయనం కలిసే తరుణం, ఎదనం పరుగే పెరిగే వేగం.." అంటూ విజయ్ ఇచ్చిన వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా.. అస్సలు పడను" అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ తో టీజర్ ను ముగించారు. టీజర్ ని బట్టి ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ అనిపిస్తోంది.

"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా కృష్ణన్ వసంత్, ప్రొడక్షన్ డిజైనర్స్ గా ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి వ్యవహరిస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.