English | Telugu

Vijay 69 Movie Review : విజయ్ 69 మూవీ రివ్యూ

మూవీ : విజయ్ 69
నటీనటులు: అనుపమ్ ఖేర్, రాజ్ శర్మ, నరేంద్ర జెట్లీ, చంఖీ పాండే, ఏకవలి ఖన్నా, తదితరులు
ఎడిటింగ్: మానస్ మిట్టల్
మ్యూజిక్: గౌరవ్ చటర్జీ
సినిమాటోగ్రఫీ: సాహిల్ భరద్వాజ్
నిర్మాతలు: మనీష్ శర్మ
రచన, దర్శకత్వం: అక్షయ్ రాయ్
ఓటీటీ: ప్రైమ్ వీడియో

కథ:
ఓ ముసలాయన ముంబైలోని సముద్ర వంతెనపైన నిలబడి దూకాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక కాసేపటికి దూకేస్తాడు. ఇక తర్వాత రోజు అరవై తొమ్మిదేళ్ల విజయ్(అనుపమ్ ఖేర్) నీళ్ళలో దూకి చనిపోయాడంటూ ఫోటో పెట్టి అందరు దేవుడికి ప్రార్థన చేస్తూ అతడి గురించి మాట్లాడుతుంటారు. అదే సమయంలో విజయ్ అక్కడికి వస్తాడు. అదంతా చూసి ఏంటి మీరు చేసేది అని అనడంతో అతడిని చూసి అందరు షాక్ అవుతారు. ఇక విజయ్ వాళ్ళ కూతురు ఫ్యామిలీ కూడా వస్తుంది. విజయ్ స్నేహితుడు డాక్టర్ ఫలీ అతనికి ఎప్పుడు అండగా ఉంటాడు. ఇక అతను చనిపోవాలనుకోలేదని నీళ్ళని చూసి స్విమ్మింగ్ చేయాలనిపించిందని, ఫోన్ చార్జ్ పెట్టి ఇంట్లోనే మర్చిపోయానని వాళ్ళాందరికి వివరించడంతో అందరు కన్విన్స్ అవుతారు.‌ ఇక ఆ తర్వాత తన స్నేహితుడు ఫలీ రాసిన ఆఫ్టర్ డెత్ లెటర్ చూసి షాక్ అవుతాడు. అందులో విజయ్ చేసిన అచీవ్మెంట్స్ ఏమీ లేవని రాయడంతో అది చూసి ఏదైనా సాధించాలని బలంగా కోరుకుంటాడు. అందుకే విజయ్ ట్రైత్లాన్ లో పాల్గొనాలనుకుంటాడు. మరి విజయ్ అందులో పాల్గొనడానికి ఎంపికయ్యాడా? ట్రైత్లాన్ లో గెలిచాడా లేదా? అనేది మిగతా కథ. (Vijay 69 Movie Review)

విశ్లేషణ:
సినిమా మొదలవ్వడమే ఇంట్రస్ట్ గా ఉంటుంది. విజయ్ క్యారెక్టర్ తో ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఓ వయసొచ్చాక పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి బరువు, భాద్యతలు ఉండవు. ఆ పాత్రలో విజయ్ పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అయితే అతను మాట్లాడే బూతులే కాస్త ఇబ్బంది పెడతాయి.

గంట యాభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా ఓ ముసలాయన లైఫ్ లో ఏదైనా గొప్పగా సాధించాలని, లైఫ్ అచీవ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఇందులో పెద్దగా ఇన్ స్పైర్ అవ్వడానికి ఏమీ లేదు. సినిమా అంతా మాములుగా బోరింగ్ గా వెళ్తుంటుంది. క్లైమాక్స్ చూసాక ఎంట్రా ఇది అనిపిస్తుంది. అరవై తొమ్మిదేళ్ళ ముసలాయన అంట.. స్విమ్మింగ్ చేస్తూ మళ్ళీ వెనుక్కొచ్చి ఒకరిని కాపాడతాడంట.. ఇక స్విమ్మింగ్ అయిన వెంటనే ఓ నలభై కిలోమీటర్లు సైక్లింగ్ అంట..ఆ వెంటనే పది కిలోమీటర్లు లాంగ్ రన్ అంట.. ఇవన్నీ చేసేస్తాడంట.. భారతీయుడు-2లో తాత క్యారెక్టర్ కంటే దారుణంగా ఉంది.

పోలీస్ ట్రైనింగ్ లో ఒక్క కిలోమీటర్ పరుగెత్తడానికే చుక్కలు కన్పిస్తాయి. మరీ ఓ ముసలాయన ఇవన్నీ చేయడం ఊహకి కూడా అందదు. సినిమాలోనే ఓ పాయింట్ లో అనుపమ్ ఖేర్ చెప్తుంటాడు. ఒకతను అరవై ఏళ్ల వయసులో ఇన్ స్టాంట్ నూడిల్స్ కనిపెట్టాడంటూ చెప్తాడు. అలాంటివి చేస్తే ఎవరైన నమ్ముతారు కానీ ఇలా రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అంటే ఆడియన్స్ కి కూడా 'ఏంట్రా మాకు ఈ కర్మ' అనిపిస్తుంది. ఇన్ స్పైరింగ్ ఎలిమెంట్స్ ఒక్కటి లేకపోగా బోరింగ్ అనిపిస్తుంది. సినిమాని ఒక్కసారి బలవంతంగా చూడొచ్చు అంతే. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
విజయ్ పాత్రలో అనుపమ్ ఖేర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. ఇక మిగతావారంతా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా..
జస్ట్ వన్ టైమ్ వాచెబుల్. అది కూడా ఓపిక ఉంటే మాత్రమే.

రేటింగ్: 2/5

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.