English | Telugu

యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ఆవిష్కరించిన సుద్దాల అశోక్ తేజ!

తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటం చేసి తెలంగాణ బాపూజీగా గుర్తింపు తెచ్చుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీపై బడుగు విజయ్ కుమార్ దర్శకత్వంలో చిరందాసు ధనుంజయ నిర్మించిన యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను ప్రఖ్యాత గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ రచయిత మసన చెన్నప్ప తో కలిసి అశోక్ తేజ యూనిటీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అశోక్ తేజ... బాపూజీ జీవన ప్రవాహాన్ని ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను విడుదల చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్న సుద్దాల అశోక్ తేజ.. తెలంగాణ ధ్వజస్తంభాలను భావితరాలు గుర్తుంచుకునేలా యూనిటీ చిత్రం ఉందన్నారు. ఇటీవల 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ల్లో ఉత్తమ దర్శకుడి విభాగంలో పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకులంతా ఉచితంగా యూట్యూబ్ లో యూనిటీ చిత్రాన్ని తప్పకుండా చూడాలని అశోక్ తేజ విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో మాస్టర్ భాను, మైమ్ మధు కీలక పాత్రల్లో నటించారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...