English | Telugu
Updated : Jul 28, 2014
శృతి హాసన్ : 1.22 మిలియన్ ఫాలోయర్స్
త్రిష : 0.899 మిలియన్ ఫాలోయర్స్
హన్సిక : 0.664 మిలియన్ ఫాలోయర్స్
సమంత : 0.644 మిలియన్ ఫాలోయర్స్
నిన్న విడుదల కావాల్సిన ఇళయ దళపతి 'విజయ్' వన్ మాన్ షో 'జననాయగన్' రిలీజ్ డేట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. మూవీలోని కొన్నిసన్నివేశాలు, డైలాగ్స్ రాజకీయపరంగా ఉండటమే అందుకు కారణం. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ తమ తోచిన అభిప్రాయాన్ని చెప్తు వస్తున్నారు
సినీ రంగం అనేది ఒక పరిశ్రమ లాంటిదే అనే విషయం తెలిసిందే. కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సినీ పరిశ్రమపై ఆధార పడి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకే సంబంధిత సినీ రంగానికి సుదీర్ఘ కాలం నుంచే రాష్ట్ర ప్రభుత్వాల చేత సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఉంటుంది. కేంద్ర స్థాయిలో కూడా సంబంధిత శాఖ ఉంటుంది. ఈ శాఖ ద్వారా సినీ రంగంలో కార్మికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలతో పాటు, సినిమాకి సంబంధించిన పలు ఇతర విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas),ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun).. పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరి మధ్య సుదీర్ఘ కాలం నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తమ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు అభినందనలు తెలుపుకుంటూ ఉంటారు. ఈ కోవలోనే ప్రభాస్ కొత్త మూవీ రాజా సాబ్ గురించి అల్లు అర్జున్ ఏం చెప్పాడో చూద్దాం.
రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే. ఈ మేరకు మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.
సెల్యులాయిడ్ పై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)మ్యానియాని మరోసారి వీక్షించడానికి మన శంకర వర ప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)ద్వారా కౌంట్ డౌన్ మొదలయ్యింది. ప్రచార చిత్రాలతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)చెప్తున్న మాటల ద్వారా సరికొత్త చిరంజీవి ని చూడబోతున్నామని అభిమానులు, ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.విక్టరీ వెంకటేష్(Venkatesh)కూడా యాడ్ కావడంతో రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏరియాకి సంబంధించిన బుకింగ్స్ ఓపెనింగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు.
బండ్ల గణేష్ కి తెలుగు సినిమాకి మధ్య ఉన్న అనుబంధం మూడు దశాబ్దాలు.ఈ మూడు దశాబ్దాలలో నటుడు స్థాయి నుంచి బడా నిర్మాతగా ఎదిగాడు. ఈ ప్రస్థానంలో తనకంటు ప్రత్యేకంగా అభిమానులని కూడా సంపాదించుకున్నాడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా బండ్ల గణేష్(Bandla Ganesh)మహా పాదయాత్రకి శ్రీకారం చుట్టాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం 'ది రాజాసాబ్'(The Raja Saab)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత వింటేజ్ లుక్ తో ప్రభాస్ చేసిన లోకల్ సబ్జెట్ తో పాటు హర్రర్ థ్రిల్లర్ కూడా కావడంతో అమెరికా నుంచి అనకాపల్లి దాకా అభిమానులు, మూవీ లవర్స్ , ప్రేక్షకులతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.
టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకులలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఒకరు. 'పటాస్' నుంచి 'సంక్రాంతికి వస్తున్నాం' వరకు అనిల్ దర్శకత్వంలో ఎనిమిది సినిమాలు రాగా.. అందులో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ముఖ్యంగా గతేడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తాజాగా 'ది రాజా సాబ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రభాస్ సినిమా కావడంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది? మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.