English | Telugu
జై హింద్.. 'ఆపరేషన్ సిందూర్'పై టాలీవుడ్ స్టార్స్ రియాక్షన్!
Updated : May 7, 2025
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పైశాచిక దాడికి మనవాళ్ళు సరైన గుణపాఠం చెప్పారంటూ.. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (Operation Sindoor)
పలువురు సినీ ప్రముఖులు భారత్ సైన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఫోటోని షేర్ చేసిన చిరంజీవి 'జై హింద్' అని రాసుకొచ్చారు. "న్యాయం జరుగుతోంది. జై హింద్" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. "మన భారత సైన్యం యొక్క భద్రత మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను" అని జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. "పిరికి పహల్గామ్ టెర్రర్ దాడులకు సమాధానం ఆపరేషన్ సిందూర్." అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు.