English | Telugu

కేరళలో ప్రభాస్ హంగామా.. లెక్కలు తారుమారు అవుతాయా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)'ది రాజాసాబ్' తో '2026 సంక్రాంతి' బరిలో దిగడం ఖాయమైన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ వాయిదాపడినా, క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఉండటానికే అని చిత్ర వర్గాలు పలుమార్లు వెల్లడి చేసాయి. దీంతో జనవరి 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి అన్ని హంగులతో ముస్తాబవుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకోగా, ఈ నెల 18 నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారభించుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వారం రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఒక బ్యూటీ ఫుల్ సాంగ్ ని, నాటు నాటు సాంగ్ ఫేమ్ 'ప్రేమ్ రక్షిత్' నృత్య దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు.

ఆ వెంటనే నెక్స్ట్ మంత్ అక్టోబర్ లో 'ఆగ్నేయ ఐరోపా'లోని గ్రీస్ లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుందని, అక్కడ మూడు సాంగ్స్ చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సాంగ్స్ లో ఇంతవరకు ఎవరు చూడని ప్రభాస్ ని చూస్తారని కూడా చిత్ర వర్గాలు చెప్తున్నాయి. ఇక అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మొదటి సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక విడుదలకి కొన్ని నెలలే ఉండటంతో ప్రచార చిత్రాల్లో కూడా వేగం పెరగనుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 2 న 'కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)'రిలీజ్ రోజు, ఆ చిత్రం ప్రదర్శించే థియేటర్స్ లో,ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి సంక్రాంతి ముందుగానే వచ్చినట్టే.

ఇక ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'రాజా సాబ్'(The Raja Saab)ఏ ఉద్దేశ్యంతో తెరకెక్కుతుందో అర్ధం అవుతుండటం , ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైం హర్రర్ కామెడీ చేస్తుండంతో రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా రాజా సాబ్ నిర్మాత విశ్వప్రసాద్ తెలియచేసున్న విషయాలతో అంచనాలు రెట్టింపు అయ్యాయి, విశ్వప్రసాద్ రీసెంట్ గా 'మిరాయ్'(Mirai)తో భారీ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన నిధిఅగర్వాల్(Niddhi Agerwal),మాళవిక మోహనన్(Malavika Mohanan),రిద్ది కుమార్(Riddhi Kumar)జత కడుతుండగా,సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దర్శకుడు మారుతీ కి తన కెరీర్ లో మొదటి బిగ్ మూవీ కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ యంగ్ అండ్ ఓల్డ్ లుక్ లో కనిపిస్తుండటం రాజా సాబ్ స్పెషాలిటీ. అభిమానులు అయితే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ లెక్కల్ని రాజాసాబ్ సరి చెయ్యాలని కోరుకుంటున్నారు. థమన్(Thaman)మ్యూజిక్.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.