English | Telugu

అల్లు అర్జున్ సినిమాకి తమన్ సంగీతం

అల్లు అర్జున్ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, వాసూవర్మ దర్శకత్వంలో, దిల్ రాజు ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నారట. ఆ సినిమాకి తమన్ సంగీతం అందిస్తారని తెలిసింది. తమన్ గతంలో "కిక్, మిరపకాయ్, వీర" వంటి చిత్రాలకు సంగీతం అందించారు. తమన్ ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న"కందిరీగ" సినిమాకి, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "దూకుడు" సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పుడు ఆలిస్ట్ లో అల్లు అర్జున్ చిత్రం కూడా వచ్చి చేరింది. అల్లు అర్జున్ ముందు రెండు సినిమాలున్నాయి. అవి పూర్తయిన తర్వాత ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు తమన్. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వాసూ వర్మ గతంలో నాగచైతన్య తొలిసారిగా హీరోగా నటించిన తొలి చిత్రం "జోష్"తో తొలిసారి దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం కూడా దిల్ రాజే నిర్మించటం విశేషం. కానీ "జోష్‍" సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాఢించకపోవటంతో మళ్ళీ దిల్ రాజే అతనికి రెండవ అవకాశమిచ్చాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.