English | Telugu
తుపాను బాధితులకు సినీ హీరోల విరాళాలు
Updated : Oct 14, 2014
ఉత్తరాంధ్రలో సంభవించిన పెను తుపానుపై తెలుగు సినిమా నటులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తుపాను బీభత్సం తమను కలచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ..తమ వంతు ఆర్ధిక సహాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నారు. అలాగే తమ అభిమానులను సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. ఉత్తరాంధ్ర తుపాను బీభత్సంపై తమ హీరోలు స్పందిస్తున్న తీరుపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తుపాను బాధితులకు సినీ హీరోలు ప్రకటించిన ఆర్ధిక విరాళాల వివరాలు:
పవన్ కళ్యాణ్ : 50లక్షలు
మహేష్ బాబు : 25లక్షలు
జూనియర్ ఎన్టీఆర్: 20లక్షలు
అల్లు అర్జున్ : 20 లక్షలు
రామ్ చరణ్ : 10 లక్షల
తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి: 25లక్షలు