English | Telugu

వెంకటేష్ తో చిరంజీవి మీద ఇష్టాన్నిపెంచుకోవద్దని అల్లు అరవింద్ చెప్పాడు

మార్తాండ్ కె వెంకటేష్(marthand k venkatesh)తెలుగు చలన చిత్ర సీమలో ఈ పేరుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది.వెంకటేష్ ఒక సినిమాని ఎడిట్ చేసాడంటే ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అనే నానుడి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.1994 లో వచ్చిన అల్లరి ప్రేమికుడుతో మొదలుపెట్టి నేటికీ టాప్ ఎడిటర్ గా కొనసాగుతూ వస్తున్నారు. అదే విధంగా రిలీజ్ కి ముందే సినిమా హిట్టా ఫట్టా అని కూడా చెప్పటంలో ఘనాపాటి. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పిన విషయాలు వైరల్ గా నిలిచాయి.

వెంకటేష్ మాట్లాడుతూ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(allu aravind)గారు డాడీ సినిమా చేసే టైంలో నీకు చిరంజీవి(chiranjeevi)గారంటే ఇష్టమా అని అడిగాడు. నేను వెంటనే అదేంటి సార్ అలా అడుగుతున్నారంటని అడిగాను. ఏం లేదు ఎడిటర్ అనే వాడు ఎవర్ని ఇష్టపడకుండా క్రిటిక్ గా ఉండాలి. హీరోల మీద ఇష్టంపెంచుకుంటే సినిమా జడ్జిమెంట్ విషయంలో తప్పు చెప్పే అవకాశం ఉంది. సినిమా విషయంలో ఎవరైనా అబద్ధం ఆడవచ్చు.కానీ ఎడిటర్ లు ఆడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని చెప్పాడు.

లెజండరీ ఎడిటర్ కే ఏ మార్తాండ్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఇప్పటి వరకు సుమారు 400 చిత్రాల దాకా పని చేసారు. నైన్టీ పర్శంట్ సక్సెస్ రేట్ తో ముందుకు దూసుపోతున్నాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.