English | Telugu
మహేష్ ని వాడేసి వివరణ ఇచ్చాడు
Updated : Sep 11, 2015
సూపర్ స్టార్ మహేష్ బాబు పై విమర్శలు చేసిన డైరెక్టర్ తేజ సడన్ రూట్ మార్చాడు. మహేష్.. ఊర్లను దత్తత తీసుకొన్నది టాక్స్‌లో బెనిఫెట్ కోసమే అంటూ ఓ సంచలన వ్యాఖ్య చేసిన తేజ ఈ రోజు దానిపై వివరణ ఇచ్చాడు. ''నేను మహేష్ బాబు పై మాట్లాడిన వీడియోని సగం కట్ చేసి ప్రచారం చేశారని, ప్రతి ఒక్కరూ టాక్స్ బెనిఫిట్ కోసం చేస్తారని, కానీ మహేష్ అలాంటి ఇంటెన్షన్తో చేయలేదు. హ్యాట్సాఫ్ టు హిమ్..అని అన్నానని'' డైరెక్టర్ తేజ అన్నాడు. అయితే తేజ సరిగ్గా తన సినిమా విడుదలకి ముందు తేజ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వ్యూహాత్మకమని, రాంగోపాల్‌వర్మ నుంచి నేర్చుకున్న కిటుకుల్ని ఇలా వాడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.