English | Telugu
తెలుగు హీరోలు సాయం చెయ్యాలి..సూర్య, విక్రమ్ భారీ అమౌంట్ ఇచ్చారు.
Updated : Aug 1, 2024
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకి సోమవారం వాయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి సుమారు 200 మందికి పైగా మృత్యు వాత పడిన విషయం అందరకి తెలిసిందే. మరణాల రేటు మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తుండటంతో ప్రతి ఒక్కరి హృదయాలు ఎంతో వేదనకి గురవుతున్నాయి.పలువురు సినిమా నటులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తమకి తోచిన ఆర్ధిక సాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ వరుసలో తాజాగా హీరో సూర్య ఫ్యామిలీ కూడా చేరింది.
సూర్య(suriya)జ్యోతిక, కార్తీ లు కలిసి వాయనాడ్ బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.అలాగే చనిపోయిన వారి కుటుంబాలకి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రిలీఫ్ ఫండ్ కి ఆ మొత్తాన్ని పంపించారు. ఇక సూర్య బాటలోనే చియాన్ విక్రమ్(vikram)కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతుగా 20 లక్షలను ఇస్తున్నట్లు ప్రకటించాడు.వీళ్లే కాకుండా ఎంతో మంది సినిమా నటులు, బిజినెస్ మేన్స్ కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు జరిగిన సంఘటనకి సంతాపాన్ని తెలుపుతు మలయాళ చిత్ర పరిశ్రమ కొన్ని రోజుల పాటు ఫంక్షన్లు, ఈవెంట్లను నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా జరుగుతుంది. మన తెలుగు సినిమాలు చాలా వరకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్నాయి. కాబట్టి తెలుగు హీరోలు కూడా కేరళకి సాయం అందించాలని ఆయా హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.
