English | Telugu

సన్నీ ఇక చెమట్లు పట్టించదా

షకీలా-సన్నీలియోన్.....ఈ రెండు పేర్లు పక్కపక్కన చూసి కొంపతీసి వీళ్లిద్దరూ ఓ సినిమా నటిస్తారని అనుంటున్నారా? ఏంటి? అదే జరిగితే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది కానీ... విషయం అదికాదులెండి. షకీలా పాతబడిపోవడంతో ఆ లోటు సన్నీ తీర్చేస్తుందని అంతా ఫిక్సైపోయారు. మొన్నటి వరకూ మెహమాటం పడకుండా థియోటర్ కి వచ్చిన వారిని నిరాశపర్చకుండా సాటిస్ ఫై చేసింది. జనాలంతా హాట్ సన్నీ అంటుంటే....తానుమాత్రం కూల్ అయిపోదామనుకుంటోందట. అందుకు ప్రయత్నాలు కూడా మొదలెట్టేసిందట సన్నీ. పోస్టర్స్, ట్రైలర్స్ తో పిచ్చెక్కించిన ఏక్ పహేలీ లీలాపై ఎన్నో ఆశలు పెట్టుకుని థియేటర్లకు వెళ్లినవారిని చాలా డిజాప్పాయింట్ చేసింది. నెక్ట్స్ మూవీలో కామెడీ చేశా చూస్కోండి అంటోందట. పైగా మీకు తెలీదు కదా.....అమెరికాలో ఉన్నప్పుడు ఓ కామెడీ ట్రూప్ లో వర్క్ చేశా... కామెడీ చెయ్యడం అక్కడే నేర్చుకున్నా అని చెప్పిందట. మరి చెమట్లు పట్టించే సన్నీ కితకితలు పెడితే చూస్తారంటారా? వెయిట్ అండ్ సీ.....

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.