English | Telugu

సీరియల్ చూసి దెయ్యాలుగా మారుతున్న ఆడవాళ్లు..సీరియల్ పేరు మీకు తెలుసా!

సీరియల్ చూసి దెయ్యాలుగా మారుతున్న ఆడవాళ్లు..సీరియల్ పేరు మీకు తెలుసా!

సమంత(Samantha)నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నతొలి చిత్రం 'శుభం'(Subham).హర్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'సినిమాబండి' ఫేమ్ 'ప్రవీణ్ కాండ్రేగుల'(Praveen Kandregula)దర్శకత్వం వహించగా గవిరెడ్డి శ్రీనివాస్ ,హర్షిత్ రెడ్డి, చరణ్ పెరి, శ్రీయ కొంతం, శ్రావణ లక్షి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 9 న విడుదల కావడానికి ముస్తాబవవుతుంది.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజయ్యింది. మూవీలోని ముఖ్య పాత్రదారులందరు తమ తమ భార్యలని అదుపులో ఉంచుకున్నామని బిల్డప్ తో చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ భార్యలు టీవీలో వచ్చే సీరియల్ చూస్తు దెయ్యంలా మారిపోయి భర్తలని ఒక ఆట ఆడుకుంటారు. ఆ విధంగా ఒక గ్రామానికి  చెందిన ఆడవాళ్లు సీరియల్ చూస్తు దెయ్యంలా మారిపోతే, మగవాళ్ళందరు ఒక మాతాజీ దగ్గరకి వెళ్తారు. ఆమె చెప్పే పరిష్కారం కూడా వాళ్ళకి ఏం అర్ధం కాదు. ఈ విధమైన అంశాలతో ఇమిడి ఉన్న 'శుభం' ట్రైలర్ నూటికి నూరుపాళ్లు హర్రర్ కామెడీతో తెరకెక్కబోతుందనే విషయం ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. మాతాజీ గా సమంత కనపడటం ట్రైలర్ కి  హైలెట్ గా నిలవడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెంచింది.

ఇక ట్రైలర్ ఈవెంట్ లో సమంత మాట్లాడుతు నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. ఒకే రకమైన చిత్రాలకి పరిమితం కావాలని అనుకోవడం లేదు. ఒక మహిళగా నాకెలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటి వైవిధ్యమైన చిత్రాలని నిర్మించి ప్రేక్షకుల ఆదరణ పొందుతాను. శుభం మూవీ అలాంటిదే అని చెప్పుకొచ్చింది.   

 

 

 

 

 

సీరియల్ చూసి దెయ్యాలుగా మారుతున్న ఆడవాళ్లు..సీరియల్ పేరు మీకు తెలుసా!