English | Telugu

మహేష్ తొక్కిన సైకిల్ మూడు లక్షలు

శ్రీమంతుడు ఫస్ట్ లుక్ లో సైకిల్ తొక్కుతూ స్టైల్‌గా, కూల్‌గా క‌నిపించాడు ప్రిన్స్‌. ఈ ఒక్క ఫొటోకే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.అయితే.. సైకిలే కదాని సింపుల్ గా తీసిపారేస్తే పొరపాటే! ఎందుకంటే.. మహేష్ ఎక్కిన ఆ సైకిల్ ఆషామాషీ సైకిల్ కాదు. దాని ధర వింటే అందరి కళ్లు బైర్లు కమ్మాల్సిందే! SCALPEL 29ER CARBON2 అనే ఆ బైసికిల్ ధర ఏకంగా మూడున్నర లక్షల ఖరీదైంది. ‘శ్రీమంతుడి’ కోసం ఆ సైకిల్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్బంగా శ్రీమంతుడు టీజర్ ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. టీజర్ తో కొరటాల శివ ఫ్యాన్స్ లో మరిన్ని ఆశలు పెంచాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.