English | Telugu

బాహుబ‌లి టీజ‌ర్ కుమ్మేస్తోంది

బాహుబ‌లి 20సెక‌న్ల టీజ‌ర్ నిన్న రాత్రి యూట్యూబ్‌లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు మ‌ద్యాహ్నం వ‌ర‌కు (548,833) ఐదుల‌క్ష‌ల హిట్లు దాటి దూసుకుపోతుంది. కేవ‌లం 20సెక‌న్ల టీజ‌రే ఇంత సంచ‌ల‌నం సృష్టిస్తుందంటే రేపు టీజ‌ర్ విడుద‌ల‌యితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌రి. ఒక‌ప్పుడు ఏదైనా తెలుగు సినిమా టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో ప‌దిరోజుల‌కు ప‌దిల‌క్ష‌ల హిట్లు వ‌స్తే అబ్బో అనుకునే వాళ్లం కానీ బాహుబ‌లి టీజ‌ర్ ఒక్క రోజు (24 గంట‌లు)గ‌డ‌వ‌క‌ముందే ఐదేసింది. ఈ రోజు గంట‌లు 50వేల వ్యూస్ వ‌స్తున్న‌ట్లు స‌మాచారం అంటే చూడండి బాహుబ‌లి తాకిడి,,, ఈ లెక్క‌న ఈరోజు సాయంత్రానికి ప‌దిల‌క్ష‌ల హిట్లు వ‌చ్చేస్తాయేమో..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.