English | Telugu

90 వ దశకంలో జరిగే పీరియాడిక్ క్రైమ్ తో రానున్న మూవీ 

ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ బాగున్న సినిమా తమ ముందుకు వస్తే చాలు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. అలాగే తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో కథ ల విషయంలో నూతన పుంతలు కూడా తొక్కుతుంది. ఎన్నో వైవిధ్యమైన కథలతో కూడిన సినిమాలు వస్తు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. తాజాగా ఇప్పుడు అదే కోవలో ఒక కొత్త చిత్రం తెరకెక్కబోతుంది.

దీక్షిత్ శెట్టి‌, శశి ఓదెల హీరోలుగా పీరియాడిక్ క్రైమ్ తో కూడిన ఒక నూతన చిత్రం తెరకెక్కబోతుంది. 90వ దశకంలో జరిగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఎల్ వి సినిమాస్ పై నిర్మాత సుధాకర్ చెెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. కె.కె దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నటించే మిగతా ఆర్టిస్ట్ ల విషయాలని కూడా మేకర్స్ అతిత్వరలోనే ప్రకటిస్తారు. అలాగే షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది కూడా వెల్లడి చేస్తారు.

ఎస్ఎల్ వి సినిమాస్ నుంచి ప్రొడక్షన్ 8 గా వస్తున్న ఈ మూవీకి పూర్ణచంద్ర తేజస్వి సంగీతాన్ని అందిస్తుండగా నగేష్ బన్నెల్ సినిమాటోగ్రాఫర్‌ గా పని చేస్తున్నాడు.కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గాను శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్ గాను శేఖర్ యలమంచిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను వర్క్ చేస్తున్న ఈ మూవీకి పిఆర్ఒ వంశీ కాకా