English | Telugu

సల్మాన్‌ రికార్డ్ బ్రేక్ చేసిన సింగమ్‌

బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగన్ ‘సింగమ్‌ రిటర్న్స్‌’తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. అజయ్ దేవగన్, కరీనా కపూర్ లు జంటగా నటించిన ఈ సినిమా క్రిటిక్స్ కి అంతగా నచ్చకపోయిన ఓపెనింగ్స్‌ మాత్రం సూపర్ గా వున్నాయి. తొలి రోజు ఈసినిమా 32.09 కోట్లు కొల్లగొట్టి సల్మాన్‌ఖాన్‌ ‘కిక్‌’ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసింది. రెండు రోజు వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా వసూళ్ళు కొద్దిగా డ్రాప్ అయినట్లు సమాచారం. మరోవైపు వరుస సెలవులు వుండడంతో వసూళ్ళ పరంగా రికార్డులు సృష్టిస్తుందన్నది ట్రేడ్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అజయ్‌దేవగన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘సింగమ్‌ రిటర్న్స్‌’ నిలిచే అవకాశం వుంది. సింగమ్‌ ఈ స్థాయి వసూళ్ళు సాధిస్తుందని ఊహించలేదనీ అజయ్‌దేవగన్‌ వ్యాఖ్యానించాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.