English | Telugu

శ్వేత‌బ‌సు నోరు విప్పితే...ఆ హీరోలు మ‌టాష్‌!

వ్య‌భిచారం కేసులో శ్వేత‌బ‌సు అరెస్ట్ వ్య‌వ‌హారం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. శ్వేత ఇంత ప‌నిచేసిందా? అని చాలామంది నివ్వెర‌పోయారు. కొంత‌మంది టాలీవుడ్ హీరోలు, నిర్మాత‌లు మాత్రం షాక్‌కి గుర‌య్యారు. ఆ షాక్ నుంచి ఇప్ప‌టికీ తేరుకోలేక‌పోతున్నారు. దానికి కార‌ణం.. వాళ్ల గుట్టు శ్వేత బ‌సు చేతిలో ఉండ‌డ‌మే. శ్వేత త‌ప్పు చేసి ఉండొచ్చుగాక‌. కానీ ఆ త‌ప్పుకి ప్ర‌త్య‌క్ష్యంగానూ, ప‌రోక్షంగానూ చాలామంది హీరోలు, నిర్మాత‌లు కార‌ణం. త‌మ వాంఛ తీర్చ‌మ‌ని కొంత‌మంది క‌థానాయ‌కులు శ్వేత‌ని చాలాసార్లు ఇబ్బంది పెట్టార‌ని, టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత‌గా చ‌లామ‌ణి అవుతున్న ఒకాయ‌న శ్వేత‌ని బ్లాక్ మెయిల్ చేయ‌డానికి కూడా వెనుకాడ‌లేద‌ని ఇన్ సైడ్ రిపోర్ట్‌. అవ‌కాశం ఇప్పిస్తాన‌ని చాలామంది శ్వేత బ‌సుని ఎర‌గా వాడుకొన్నారు. నెల‌ల త‌ర‌బ‌డి ఆఫీసులు చుట్టూ తిప్పించుకొన్నారు. త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని అలిగిన ఓ నిర్మాత‌.. ఆమెకు ఎలాంటి ప‌బ్లిసిటీ దొరక్కుండా జాగ్ర‌త్త ప‌డి త‌న అక్క‌సు తీర్చుకొన్నాడు. శ్వేత జీవితాన్ని లోతుగా అర్థం చేసుకొనే ప్ర‌య‌త్నం చేస్తే.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు కోకోల్ల‌లు. శ్వేత నోరు విప్పితే త‌మ జాత‌కాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని భ‌య‌ప‌డుతున్నారంతా. అయితే శ్వేత తాను ఇరుక్కోవ‌డ‌మే కాకుండా, మిగ‌తావారినీ బుక్ చేస్తుందా? లేదంటే ఆ గుట్టు త‌న‌లోనే దాచుకొంటుందా?? ఏమో మ‌రి.. ఆ హీరోల భ‌విష్య‌త్తు శ్వేత తీసుకొనే నిర్ణ‌యంపైనే ఆధార‌ప‌డి ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.