English | Telugu

సల్మాన్ కి వాచ్ తొడిగింది జాకబ్ అరబో..ఖరీదు 42 కోట్లు 

బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్(salman khan)యాక్టింగ్ గురించి గాని, సాధించిన ఘన విజయాల గురించి గాని కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. 1989 లో వచ్చిన ప్రేమ పావురాలు దగ్గర్నుంచి లాస్ట్ ఇయర్ థియేటర్స్ లో అడుగుపెట్టిన టైగర్ 3 దాకా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. సల్మాన్ తాజాగా ఒక వాచ్ ని ధరించాడు. ఇక అంతే నిమిషాల్లో సల్మాన్ మ్యాటర్ వైరల్ గా మారింది.

జాకబ్ అరబో.. 1986లో జాకబ్ అండ్ కంపెనీని స్థాపించి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్‌గా ఎదిగిన ప్రముఖ అమెరికన్ జ్యువెలరీ అండ్ వాచ్ డిజైనర్. వరల్డ్ వైడ్ గా ఉన్న ఖరీదైన వాచ్ లకి అతి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఎంతో పేరు ప్రఖ్యాతులని సంపాదించాడు.రీసెంట్ గా సల్మాన్ కి ఒక ఖరీదైన వాచ్ ని తొడిగాడు.దాని విలువ అక్షరాల నలభై రెండు కోట్ల రుపాయాలు. 714 డైమండ్స్ దాకా ఆ వాచ్ లో ఇమిడి ఉంటాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ వాచ్ ని తొడిగిన పిక్ ని సల్మాన్ తన ఎక్స్ వేదికగా షేర్ చేసుకోవడంతో ఈ విషయం బయటకి వచ్చింది. ఆ వీడియో చూసిన సల్మాన్ ఫ్యాన్స్, నెటిజన్స్ అయితే ఆ వాచ్ ని జాకబ్ నిజంగానే సల్మాన్ కి ఇచ్చాడా లేకా కాసేపు అలా తొడిగాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ప్రస్తుతం సికందర్(sikandar)అనే మూవీ చేస్తున్నాడు.ఇటీవల ఒక ఫైటింగ్ సీక్వెన్స్ లో సల్మాన్ కి గాయాలు అయ్యాయి. కానీ వచ్చే రంజాన్ కి రిలీజ్ చెయ్యాలనే పట్టుదలతో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. చిరంజీవి(chiranjeevi)తో స్టాలిన్ ని తెరకెక్కించిన మురుగుదాస్(murugadoss)దర్శకుడు కాగా రష్మిక(rashmika) హీరోయిన్.సల్మానే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .