English | Telugu

‘సబా నయగన్’మూవీ రివ్యూ


మూవీ : సబా నయగన్
నటీనటులు: అశోక్ సెల్వన్, మేఘా ఆకాశ్, కార్తీక మురళీదరణ్, చాందిని చౌదరి తదితరులు
ఎడిటింగ్: గణేశ్ శివ
మ్యూజిక్: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణియన్, దినేష్ పురుషోత్తమన్
నిర్మాతలు: అరవింద్ జయబాలన్
రచన, దర్శకత్వం : సి.ఎస్. కార్తికేయన్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కథ:

చెన్నై లోని ఓ ఏరియాలో రాత్రిపూట డ్రంక్ చేసి ఉన్న సబా పోలీసులకి చిక్కుతాడు. ఆ తర్వాత మరొకతను రెండు బీరు బాటిల్లతో దొరుకుతాడు. ఇక దారిలో వెళ్తుండగా లవ్ ఫెయిల్యూర్ సర్ అందుకే తాగాలని డిసైడ్ అయ్యానని అతను చెప్పగానే ఎస్స్ఐ విష్ణు అతడిని జీబు నుండి దింపేసి వెళ్ళిపోమంటాడు. అది చూసిన సబా.. అయ్యో ఎందుకు సర్ వాడిని దింపేసారు. వాడిది ఒక్కటే లవ్ స్టోరీ నావి మూడు లవ్ స్టోరీలున్నాయని అనగానే.. అందులోని కానిస్టేబుల్స్ చెప్పమంటారు. ఇక సబా అతని మూడు లవ్ స్టోరీలను వారికి చెప్తుంటాడు. అసలు సబా లవ్ స్టోరీలు ఎందుకు చెప్పాడు? ఎస్సై విష్ణు నుండి సబా ఎలా తప్పించుకు‌న్నాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ:

కామెడీకి ఎక్కువ ప్రధాన్యత ఇస్తూ లవ్ స్టోరీలతో అంతగా ఆకట్టుకోలేకపోయారు డైరెక్టర్ సి.ఎస్.‌ కార్తికేయన్. ఒక రెండు మూడు సినిమాలని మిక్స్ చేసి వాటిల్లోని కొన్ని ముఖ్యమైన వాటిని తీసుకొని సినిమాగా తీసినట్టుగా అనిపిస్తుంది.

ఈ సినిమాలో మొత్తంగా అయిదు పాటలు వస్తాయి. ఏవి ఎందుకు వస్తున్నాయో అర్థం కాకముందే మరో కొత్త లవ్ స్టోరీ వస్తుంది. ఎంతకీ ఓ కొలిక్కిరానీ కథలు.‌‌. ఎప్పుడైపోతుందా అనే స్టోరీ.. మొత్తంగా సినిమా చూసే ప్రేక్షకుల ఓపికకి పరీక్ష పెట్టాయి. సినిమా నడుస్తున్నంతసేపు .. అరే ఈ డైలాగ్ ఎక్కడో విన్నామే, ఈ సీన్ ఎక్కడో చూసామే అన్నట్టుగా సాగుతోంది. ప్రథమార్థంలో సాగే ల్యాగ్ ద్వితీయార్థంలో ఉండదని అనుకుంటే పొరపాటే ల్యాగ్ రంబోలా అన్నట్టుగా ఉంటుంది. కథలో కొత్త కొత్తగా క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి. ఎవరొచ్చారు.. ఎందుకొచ్చారో తెలియాలంటే మీకు క్లైమాక్సే గతి అన్నట్టు అన్నింటిని కలిపి చివరి అయిదు నిమిషాల్లో చూపించారు మేకర్స్. కామెడీకి ప్రధాన్యమివ్వాలని చెప్పి మెయిన్ కథను మర్చిపోయినట్టుగా అనిపించింది. బాలసుబ్రహ్మణియన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గణేశ్ శివ ఎడిటింగ్ పర్వాలేదు. లియోన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

సరే ఫ్యామిలీతో కలిసి చూద్దామా అంటే అసలు కథే లేదు. ఏమీ లేని కథకి అయిదు పాటలని జోడించి నాలుగు అరిగిపోయిన డైలాగ్స్ తో సాగదీసారు అంతే. మీకో క్లారిటీ రావాలంటే క్లైమాక్స్ చూడాల్సిందే అన్న పంథాలో తీసుకెళ్ళాడు దర్శకుడు. కానీ అది సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.

నటీనటుల పనితీరు:

సబా పాత్రలో అశోక్ సెల్వగన్ ఆకట్టుకున్నాడు. దీప్తి పాత్రలో కార్తీక మురళీధరన్ మెప్పించింది. మేఘా పాత్రలో మేఘా ఆకాశ్, రియా పాత్రలో చాందిని చౌదరి, పోలీస్ కానిస్టేబుల్ గా మయిలసామి తమ పాత్రలకి న్యాయం చేసారు.

ఫైనల్ గా :

మూడు అర్థం పర్థం లేని లవ్ స్టోరీలని అర్థం కాకుండా చూపించిన ఈ కామెడీ చిత్రాన్ని ఓసారి చూడాలంటే ఓపికతో పాటు టైమ్ కూడా బాగా ఉండాలి.


రేటింగ్ : 2 /5

✍️. దాసరి మల్లేశ్

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.