English | Telugu

పవన్ కళ్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్

ఒకప్పటి హీరోయిన్ రేణుదేశాయ్(renu desai)కి పవన్ కళ్యాణ్(pawan kalyan)మాజీ భార్యగా పవన్ అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోను మంచి గుర్తింపు ఉంది.కొన్నాళ్ల క్రితం సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా కూడా ఆ తర్వాత వెనకడుగు వేసింది.గత కొంత కాలం నుంచి పలు రకాల సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఎన్నో సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో షూటింగ్ లో పాల్గొనడం కోసం ఏడాది తర్వాత మళ్ళీ మేకప్ వేసుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది.అయితే సినిమా వివరాలు, హీరో ఎవరనే విషయం మాత్రం వెల్లడి చెయ్యలేదు.దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ సినిమా వివరాలు కూడా చెప్పచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే ఆ సినిమా పవన్ దేనా అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి ఏడాది తర్వాత రేణు షూటింగ్ లో పాల్గొనబోతుండంతో ఆమె అభిమానులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు

మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి తో హీరోయిన్ గా సినీ అరంగ్రేటం చేసింది.ఆ తర్వాత తమిళంలో జేమ్స్ పండు అనే మూవీతో పాటు పవన్ తోనే జానీ అనే మరో మూవీలో చేసింది.ఇక ఆ తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పి పవన్ నటించిన చాలా సినిమాలకి స్టయిలిస్ట్ గా వర్క్ చేసింది.గత సంవత్సరం రవితేజ(ravi teja) హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు లో ఒక కీలకమైన పాత్రలో చేసి మెప్పించింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.