English | Telugu

రష్మిక కి ఘోర అవమానం..ఇది ఆ హీరో పనే

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(rashmika mandanna)కన్నడ నాట తెరకెక్కిన'కిరాక్ పార్టీ'అనే మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా మంచి వసూళ్ళని కూడా రాబట్టింది.ఇక రష్మిక నటనకి అయితే ప్రతి ఒక్కరు ఫిదా అవ్వడంతో పాటుగా ఆమె కెరీర్ కి కూడా 'కిరాక్ పార్టీ' బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు.

ఇక ఈ మూవీ 2016 డిసెంబర్ 30 న రిలీజ్ అయ్యింది.దీంతో ఎనిమిది సంవత్సరాలైన సందర్భంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా 'కిరాక్ పార్టీ' సినిమా పోస్టర్ ని షేర్ చేస్తు ఎనిమిది సంవత్సరాలక్రితం,హృదయాలను తాకిన మరియు లెక్కలేనన్ని జ్ఞాపకాలను సృష్టించే ప్రయాణం ప్రారంభమైంది.కిరాక్ పార్టీని చాలా ప్రత్యేకం చేసిన మీ ప్రేమ మరియు మద్దతుకి ధన్యవాదాలు అంటూ 'ఎక్స్' వేదికగా షేర్ చేసాడు.కాకపోతే పోస్టర్ లో రష్మిక ఫోటో లేదు.దీంతో రష్మిక అభిమానులు రిషబ్ శెట్టి తీరుపై ఫైర్ అవుతు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.కిరాక్ పార్టీ సమయంలోనే ఇందులో హీరోగా చేసిన రక్షిత్, రష్మిక లు ప్రేమలో పడ్డారు.ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.కానీ పెళ్లి పీటలు ఎక్కకుండానే అనుకోని కారణాల వల్ల విడిపోయారు.

రష్మిక ఇటీవలే పుష్ప 2 తో భారీ విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం ఆమె చేతిలో ది డార్లింగ్, సికిందర్,రెయిన్ బో,చావా, కుబేర వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.