English | Telugu

రామాయణ మూవీపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

భారతీయ ఇతిహాసాల్లో 'రామాయణానికి' ఉన్న ప్రాశస్త్యం అందరకి తెలిసిందే. అందుకే రాముడు గురించి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఈ కోవలోనే మరోసారి రణబీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా 'రామాయణ' అనే మూవీ చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ యష్ రావణుడి క్యారక్టర్ లో కనపడుతుండగా నితీష్ తివారి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. రెండు భాగాలుగా 'రామాయణ' ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కాబోతున్నాయి.

రీసెంట్ గా 'రామాయణ' మూవీని ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడణవీస్‌ మాట్లాడుతు మన దేశంలో గొప్ప కథలు తెరకెక్కడంతో పాటుగా మన కళ, నాటక రంగం, సంగీతం చాలా పురాతనమైనవి. వీటికి తాజాగా సాంకేతికత జోడించాలని అనుకుంటున్నాం. రామాయణ విషయంలో ఇదే జరుగుతోంది. నేను ప్రధానితో కలిసి రామాయణకి సంబంధించిన సెట్స్‌ ని సందర్శించి సెట్ క్వాలిటీ చూసి ఆశ్చర్యపోయాను. కొత్త తరానికి మనం కథలు చెప్పడానికి ఇదే సరైన మార్గం. రామాయణ మూవీ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటుందని నేను నమ్ముతున్నానని తెలిపారు.

సన్నీ డియోల్, రకుల్, లారాదత్తా వంటి నటులు కూడా రామాయణలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి యష్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.