English | Telugu

రకుల్ ప్రీత్ సింగ్ కి తీవ్రగాయాలు..ఓవర్ గా చెయ్యడం వల్లే

ఎన్టీఆర్(ntr)రామ్ చరణ్(ram charan)అల్లు అర్జున్(allu arjun)నాగార్జున(nagarjuna)వంటి స్టార్ హీరోలతో జోడి కట్టి టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిన నార్త్ ఇండియన్ భామ రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh)తెలుగు నాట కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో అడుగుపెట్టి వరస పరాజయాలని చవి చూసింది.కొన్ని నెలల క్రితమే జాకీ భగ్నానీ అనే ప్రొడ్యూసర్ ని పెళ్లి కూడా చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగన్ తో కలిసి దేదేప్యార్ దే 2 లో చేస్తుంది.

జిమ్‌లో రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేసే రకుల్ ఎనభై కేజీల బరువును లిఫ్ట్ చేసే క్రమంలో వెన్నెముఖకి గాయం అయినట్లుగా తెలుస్తోంది. వర్కవుట్ చేటప్పుడు బెల్ట్ పెట్టుకోకుండా భారీ వెయిట్ లిఫ్టింగ్ చేయడంతోనే ఇలా జరిగిందని ముంబై వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్లు ఆమెను పరిశీలించి కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారని కూడా అంటున్నారు. కాకపోతే ఆమె హెల్త్ కి సంబంధించిన మరో న్యూస్ కూడా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

రకుల్ కి గాయం అయ్యి రెండు వారాలపైనే అవుతుందని, ఇప్పటికే బెడ్ రెస్ట్ కూడా తీసుకుంటుందని కాకపోతే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో రకుల్ త్వరగా గాయం నుండి కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...