English | Telugu

నేను వికలాంగుడినే

"నేను వికలాంగుడినే, నాకు నత్తి ఉండేది. అందరూ హేళన చేశారు, మా నాన్న పేరు సరిగ్గా పలకడం రాకపోయేది. పట్టుదలతో డాక్టర్ అయ్యాను, సినిమా హీరో అయ్యాను. మనం అంతా సమానం అనే భావన ఉండాలి. దివ్యాంగులు నిరుత్సాహపడకూడదు, పట్టుదలతో ముందుకు వెళ్ళాలి, నా జీవితాంతం వికలాంగులకు సహాయ పడుతా..." అని అన్నారు గరుడ వేగా తో సక్సెస్ సొంతం చేసుకున్న సినీ నటుడు రాజశేఖర్. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా... నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా లో దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమ కోసం అవగాహన సదస్సు.. మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హీరో రాజశేఖర్ తో పాటు, ఆయన సతీమణి జీవితా రాజశేఖర్, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహామూద్ ఆలీ, చింతల రామచంద్రా రెడ్డి, సౌమ్య మిశ్రా..ఐ. జి. తదితరులు పాల్గొన్నారు. అయితే, రాజశేఖర్ కి నత్తి ఉండేది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పట్టుదల ఉంటే... ఎలాంటి సమస్యలు వచ్చినా ధీటుగా ఎదుర్కోవచ్చు... ఈ విషయంలో రాజశేఖర్ జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఒక డాక్టర్ గా... ఒక హీరో గా, ఒక ఫామిలీ మ్యాన్ గా... అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించిన రాజశేఖర్ తాను ఒక వికలాంగుడిని అని పబ్లిక్ గా అనౌన్స్ చేయడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబంబిస్తుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.