English | Telugu

నాని కోసం రాజమౌళి.. వర్కౌట్ అవుతుందా..?

దర్శకధీరుడు రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని మధ్య మంచి అనుబంధం ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఈగ'లో నాని నటించారు. అలాగే నాని హీరోగా యాక్ట్ చేసిన 'మజ్ను'లో రాజమౌళి గెస్ట్ రోల్ చేశారు. అంతేకాదు, నాని సినిమా వేడుకలకు రాజమౌళి గెస్ట్ గా హాజరవుతుంటారు. ఇప్పుడు మరోసారి నాని కోసం ఆయన రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. (Hit 3)

నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హిట్-3'. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'హిట్-3'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంది. ఏప్రిల్ 27న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

హిట్ ఫ్రాంచైజ్ లో రూపొందిన 'హిట్-1', 'హిట్-2' సినిమాల వేడుకలకు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి, 'హిట్-3' కూడా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.