English | Telugu

బాహుబలిని భయపెడుతోన్న సత్యమూర్తి

చించేస్తాయ్, రికార్డుల దుమ్ముదులిపేస్తాయ్ అనుకున్న సినిమాలన్నీ ఈ మధ్య దారుణంగా దెబ్బతింటున్నాయి. కల్లోకూడా ఊహించని రిజల్ట్ ఇచ్చి ఫ్యాన్స్ ని షాక్ లోకి నెట్టేస్తున్నాయి. దీంతో ఇప్పుడందరి కళ్లూ రాజమౌళి బాహుబలిపై పడ్డాయి. ఈ సినిమాపై కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్య భారీ అంచనాలనడుమ ప్రేక్షకుల మధ్యకొచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిలవుతున్నాయి. దీంతో తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న రాజమౌళి చిత్రంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందో..ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అనే టెన్షన్లో ఉన్నారంతా. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన సన్నాఫ్ సత్యమూర్తి, కొద్దిరోజుల క్రితం విడుదలైన శంకర్ ఐ దెబ్బతినడంతో బాహుబలి అంటే పెదవివిరుస్తున్నారు.

త్రివిక్రమ్...మాటల మాంత్రికుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకున్నాడు. ఎంత పెద్ద హీరో అయినా.....డైరెక్టర్ ని చూసి కళ్లుమూసుకుని థియేటర్ల ముందు క్యూ కడతారు. పొట్టిపొట్టి మాటలతో దుమ్ముదులిపే డైలాగ్స్ తో కేక పెట్టిస్తాడు త్రివిక్రమ్. ఈయన సినిమా అంటే ఫ్లాప్ అనే మాటే వినిపించదని ఫిక్సైపోయారు. కానీ ఏం జరిగింది?

రేసుగుర్రంలా దూసుకుపోతున్న బన్నీ-మాటలతో మాయచేసే త్రివిక్రమ్. ఈ జులాయి కాంబినేషన్ అంటే రికార్డుల మోతే అనుకున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి టైటిల్ చూసి....విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ చూసి సంబరపడ్డారు. ఫేడవుట్ అయిపోయిన తారలందర్నీ మూకుమ్మడిగా తీసుకొచ్చి సినిమాలో పోగుపోశాడు. కానీ ఏం ఒరిగింది? రెండు మూడు పాత్రలకు మినహా మిగిలిన వారిని వాడుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా...సన్నాఫ్ సత్యమూర్తి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపర్చిందనేది వాస్తవం.


ఇక భారీ అంచనాలతో వచ్చి బోర్లాపడిన మరో చిత్రం శంకర్ 'ఐ'.సమాజాన్ని మేలుకొలిపే చిత్రాలు తెరకెక్కించే శంకర్ అంటే సినీప్రియులకు భలే ఇష్టం. శంకర్ చిత్రాలను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తే కాదు. ఏళ్లు గడుస్తున్నా టీవీలో శంకర్ సినిమా వస్తోందంటే విశేష ఆదరణ లభిస్తుంది. అలాంటి దర్శకుడు కోట్లు ఖర్చుపెట్టి భారీ హంగులతో ఐ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూశారు.

కేవలం శంకర్ ను చూసే కాదు....ప్రయోగాలకు మారుపేరైన విక్రమ్ హీరో కావడంతో మరింత అంచనాలు పెరిగాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అపరిచితుడు కాంబినేషన్ కావడంతో అంచనాలు అంబరాన్నంటాయి. ట్రైలర్లో విక్రమ్ వేషాలు చూసి అబ్బురపడ్డారు. కానీ ఎంతగానో ఎదురుచూసిన ఆ చిత్రం థియోటర్ కివచ్చాక ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. సినిమా చూస్తున్నంత సేపూ విసుగు పుట్టించింది.



దీంతో ఇప్పుడందరి కళ్లూ టాలీవుడ్ జక్కన్న రాజమౌళిపై పడ్డాయి. అపజయమెరుగని దర్శకుడిగా గుర్తింపు పొందిన రాజమౌళి, మిర్చితో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న బాహుబలిపై భారీ అంచనాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఛత్రపతిని మించి బాహుబలి ఉంటుందని ఫిక్సయ్యారు. ఇప్పటికే భారీగా బిజినెస్ కూడా జరిగిందన్నారు. మొదటి భాగం విడుదలకు సిద్ధమైంది కూడా. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతుండడంతో బాహుబలి గురించి కాస్తంత భయపడుతున్నారు.

మరి బాహుబలి..... సత్యమూర్తి, ఐ ని ఫాలోఅవుతుందో......అంచనాలకు మించి రికార్డులు క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.