English | Telugu

ఆ ప్ర‌శ్న విని.. రెచ్చిపోయిన రాజ‌మౌళి



రాజ‌మౌళిని ఎప్పుడు చూసినా ప్ర‌శాంతంగా క‌నిపిస్తాడు. మీడియా ముందు... ఆయ‌నెప్పుడూ కంట్రోల్ త‌ప్ప‌లేదు. ఏ ప్ర‌శ్న అడిగినా ఓర్పుతో స‌మాధానం చెబుతాడు. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో ఓ ప్ర‌శ్న‌విని రాజ‌మౌళి రెచ్చిపోయాడ‌ట‌. `నాన్సెన్స్‌...ఇలాంటి ప్ర‌శ్న‌లు నా ద‌గ్గ‌ర అడుగుతారా?` అంటూ మైకు విసిరికొట్టి.. అక్క‌డి నుంచి వెళ్లిపోయాడ‌ట‌.

`బాహుబ‌లి` ప్ర‌మోష‌న్లు మ‌హా జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. టీవీ ఛాన‌ళ్ల‌కు రికార్డెడ్ ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వ‌స్తున్నాడు రాజ‌మౌళి. ఓ టీవీ ఛాన‌ల్ రాజ‌మౌళిని ఇంట‌ర్వ్యూ చేస్తూ చేస్తూ... ఓ అభ్యంత‌ర‌క‌ర‌మైన ప్ర‌శ్న అడిగిన‌ట్టు స‌మాచారం. ఆ ప్ర‌శ్న కూడా ప్ర‌భాస్‌ని ఉద్దేశించే. ఆమ‌ధ్య ప్ర‌భాస్ వ్య‌వ‌హారంలో ఓ రాజ‌కీయ నాయ‌కురాలితో ముడిపెట్టి వేడి వేడి క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ప్ర‌శ్న రాజ‌మౌళిని అడిగార‌ట‌. దాంతో రాజ‌మౌళికి కోపం వ‌చ్చేసింద‌ట‌.

`ఇలాంటి ప్ర‌శ్న‌లు న‌న్ను అడ‌గుతారా` అంటూ అలిగి.. ఆ ఇంటర్వ్యూని అక్క‌డితో ముగించి వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి సున్నిత‌మైన విష‌యాల్లో స్పందించ‌డం ఎవ‌రికైనా.. ఇబ్బందే మ‌రి! మొత్తానికి రాజ‌మౌళి కోపం ఎలా ఉంటుందో స‌ర‌దు మీడియా వారికి ప్ర‌త్య‌క్షంగా తెలిసొచ్చిన‌ట్టైంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.