English | Telugu
టెంపర్‌కి దర్శకేంద్రుడి కితాబు
Updated : Feb 14, 2015
టెంపర్‌కి పాజిటీవ్ టాక్ వస్తోంది. అభిమానులు కొత్త ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. సినీ ప్రముఖులు కూడా టెంపర్ పై పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. రాజమౌళి, పూరి, వర్మ.. వీళ్లంతా బెనిఫిట్ షోలో సందడి చేశారు. ఆ తరవాత ఒకొక్కరూ టెంపర్ ఫీవర్‌లో మునుగుతూ... టెంపర్ సూపర్ హిట్.. హిట్ అంటూ ట్విట్టర్లలో తమ స్పందనను పంచుకొంటున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా టెంపర్ సూపర్ హిట్ అంటున్నారు. ఆయన సినీ మాక్స్‌లో ప్రత్యేకంగా టెంపర్‌ని వీక్షించారు. అనంతరం ఫేస్ బుక్‌లో తన స్పందన పంచుకొన్నారు. ''టెంపర్ చూశాను. తారక్ నటన అద్భుతంగా ఉంది. పరిశ్రమలో తానెంత గొప్ప నటుడో మరోసారి నిరూపితమైంది. స్ర్కీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. సెకండాఫ్ లోని ఎమోషన్లు చాలా గ్రిప్పింగ్ గా సాగాయి. పూరి, తారక్‌లకు గొప్ప కమ్‌బ్యాక్ సినిమా ఇది''r అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.