English | Telugu
మళ్లీ ఓ కొత్త ఎన్టీఆర్ పుట్టాడు
Updated : Feb 14, 2015
''ఈ సినిమాతో తెలుగు చిత్రసీమకు ఓ కొత్త ఎన్టీఆర్‌ని పరిచయం చేస్తున్నా'' అంటూ టెంపర్ ఆడియో వేడుకలో అభిమానులకు మాటిచ్చాడు పూరి జగన్నాథ్. ఆ మాట నిలబెట్టుకొన్నాడు. ''ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా కొత్తగా ఉన్నాడు'' అంటూ అభిమానులే కాదు, యావత్ తెలుగు సినీ ప్రపంచం ముక్తకంఠంతో చెబుతోంది. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజీలో, డైలాగ్ డెలివరీలతో కొత్తదనం అడుగడుగునా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఎప్పుడూ లేనంత కసిగా పనిచేశాడు ఎన్టీఆర్. ఆ కసి తెరపై కనిపించింది. సిక్స్ ప్యాక్ చేశాడు... ఇది వరకటిలా డాన్సుల్లో అదరగొట్టాడు.. ఎమోషనల్ సీన్స్‌లో పీక్స్ అంటే ఏంటో చూపించాడు. ఎన్టీఆర్ నటన చూసి దర్శకులు సైతం 'వారెవా' అంటున్నారంటే ఎన్టీఆర్ ఏ రేంజులో విజృంభించాడో అర్థం చేసుకోండి. టోటల్‌గా చెప్పాలంటే ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఇది. బుజ్జిగాడుతో ప్రభాస్‌కి, బిజినెస్‌మేన్‌తో మహేష్ బాబుకీ కొత్త డైమెన్షన్ ఇచ్చాడు పూరి. వాళ్ల నటనలోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ని అభిమానులకు కొత్తగా చూపించాడు. అందుకే ఎన్టీఆర్ ఇంతలా మారడానికి కారణమైన పూరికే క్రెడిట్స్ అన్నీ కట్టబెట్టాలి. థ్యాంక్యూ పూరి.