English | Telugu
అమ్మకు గుడి కట్టిస్తున్న లారెన్స్..
Updated : May 11, 2016
అమ్మ మీద ఒక్కొక్కరు ఒక్కో లాగా ప్రేమను చూపిస్తారు. కాని ఎంత చేసినా అమ్మ రుణం మాత్రం తీర్చుకోలేరు. నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ఇలా అన్ని రంగాల్లో తన ప్రతిభను చూపించారు. అమ్మ ప్రేమను ఎంతగానో ఆస్వాదించే లారెన్స్, ఎన్నో వేదికలపై తన మాతృమూర్తి అంటే ఎంత ఇష్టమో తెలియజేశారు. ఆ ఇష్టాన్ని అందరికంటే విభిన్నంగా చూపించాలనుకునితన తల్లి కణ్మణికి గుడికట్టించాలనుకున్నాడు. అనుకోవడమే కాదు తన తల్లి కోసం గుడికట్టిస్తున్నాడు. తల్లి జీవించి ఉండగానే ఇలా గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట చేయడం లారెన్స్ ఒక్కరికే చెల్లింది. రాజస్థాన్‌లో తల్లి శిలా రూపాన్ని తయారు చేయించిన లారెన్స్, తమిళనాడులోని తన తండ్రి స్వగ్రామం పూవిరుందవలైలో తన ఇష్టదైవం రాఘవేంద్రస్వామి గుడి ఎదురుగానే తన మాతృమూర్తికి గుడి కట్టిస్తున్నాడు. వాళ్ల అమ్మగారి విగ్రహనికి సంబంధించిన ఫోటోను మాతృదినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అంతే కాకుండా మా అమ్మకు కట్టిస్తున్న గుడి ప్రపంచంలోని మాతృమూర్తులందరికి అంకితం చేస్తున్నట్లు తెలియజేశాడు.