English | Telugu

100 గ్రేటెస్ట్ ఫిలిమ్స్ లో 'ఆర్ఆర్ఆర్' స్థానమిదే..!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' (RRR) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల గ్రాస్ రాబట్టింది. గ్లోబల్ స్థాయిలో ఎన్నో పురస్కారాలను, ప్రశంసలను అందుకుంది. తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది.

ఇండీవైర్ అనే ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ 2020లలో ఇప్పటిదాకా వచ్చిన వంద ఉత్తమ చిత్రాల లిస్టుని ప్రకటించింది. ఇందులో ఆర్ఆర్ఆర్.. 75వ స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి మూడు స్థానాల్లో 'నికెల్ బాయ్స్', 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ఆఫ్టర్ సన్' చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఏడో స్థానంలో 'టాప్ గన్: మావెరిక్', 54వ స్థానంలో 'ఓపెన్‌హైమర్', 58వ స్థానంలో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' నిలిచాయి.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ అడ్వెంచర్ తో మరోసారి గ్లోబల్ వైడ్ గా రాజమౌళి పేరు మారుమోగిపోవడం ఖాయమని చెప్పవచ్చు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.