English | Telugu

నితిన్ - పూరి మ‌ధ్య క్లాష్‌

చిత్ర‌సీమ పేరుకు త‌గ్గ‌ట్టే మ‌హా విచిత్ర‌మైంది. ఏ కాంబినేష‌న్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో, ఏ సినిమా ఎప్పుడు, ఎందుకోసం మ‌ధ్య‌లో ఆగిపోతుందో చెప్ప‌లేం. ఇప్పుడు నితిన్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబో ప‌రిస్థితీ అంతే. హార్ట్ ఎటాక్ సినిమా ఫ్లాప్ అయినా.. ఈ కాంబినేష‌న్ మ‌ళ్లీ క‌లుస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

పూరి, నితిన్ కూడా 'ఓకే చేసేద్దాం' అనుకొన్నారు. ఈనెల 15నుంచి సినిమా మొద‌లెట్టాల‌ని ఫిక్స్ అయ్యారు. కానీ అంత‌లో ఏమైందో... ఈ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని అటు పూరి, ఇటు నితిన్ కూడా ధృవీక‌రించారు. కార‌ణాలు మాత్రం చెప్ప‌డం లేదు. అయితే.. నితిన్ వ్య‌వ‌హారం న‌చ్చ‌క పూరి, పూరి చెప్పిన క‌థ సంతృప్తినివ్వ‌క నితిన్ ఇద్ద‌రూ టాటా చెప్పేసుకొన్నార‌ని టాక్‌.

నితిన్ మితిమీరిన జోక్యం.. పూరిని చికాకు తెప్పించింద‌ని వికినిడి. క‌థ‌లో, ఇత‌రత్రా వ్య‌వ‌హారాల్లో నితిన్ విప‌రీతంగా జోక్యం చేసుకొంటున్నాడ‌ని, అది న‌చ్చ‌క పూరి... ప‌క్క‌కు వెళ్లిపోయాడ‌ని తెలుస్తోంది. క‌థ బాగానే ఉన్నా.. ట్రీట్‌మెంట్ స‌రిగా లేద‌న్న నెపంతో నితిన్ కూడా.. ఈసినిమా వ‌ద్ద‌నుకొన్నాడ‌ట‌. దాంతో.. ఇద్ద‌రూ సినిమా మొద‌లెట్ట‌క ముందే 'తూచ్‌' చెప్పేసుకొన్నారు. అదీ సంగ‌తి. పోనీలెండి... స‌గం సినిమా అయ్యాక ఈ క్లాష్ వ‌స్తే.. కోట్ల‌కు కోట్లు న‌ష్టం వ‌చ్చేది. ముందే.. బ‌య‌ట‌ప‌డ్డారు. అదీ ఒక రకంగా మంచిదే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.