English | Telugu

ఆదిపురుష్ లోని కొన్ని సీన్స్ నచ్చలేదంటున్న హనుమాన్ డైరెక్టర్

హనుమాన్(hanuman)మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ(prashanth varma) సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలతో పాటు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతున్న హనుమాన్ తాజాగా 250 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన ఒక ఫంక్షన్ లో ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి.

ప్రశాంత్ వర్మ ఆదిపురుష్( adipurush)మూవీ గురించి మాట్లాడుతు నేను ఆదిపురుష్ చూశానని అందులోని కొన్ని సీన్స్ తనకి నచ్చలేదని తానైతే ఆ సీన్స్ ని ఇంకా బాగా తెరకెక్కించేవాడినని చెప్పాడు. పైగా ప్రతి దర్శకుడు కూడా ఒక సినిమా చూస్తున్నంతసేపు అందులో వస్తున్న సీన్స్ ని తాను ఏ విధంగా తెరకెక్కిస్తాడో ఉహించుకుంటాడని కూడా ఆయన చెప్పాడు. అలాగే సినిమాలోని కొన్ని సీన్స్ చూసి చాలా ఆశ్చర్యపోయానని అవి తనకెంతో నచ్చాయని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఆదిపురుష్ సినిమా ఫలితం తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని కూడా ప్రశాంత్ చెప్పాడు.. ఈ విషయాలన్నీ హిందీ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రశాంత్ చెప్పడం జరిగింది

హైదరాబాద్ లో ఎంతో అట్టహాసంగా జరిగిన హనుమన్ సక్సెస్ మీట్ లో హీరో తేజ సజ్జ (teja sajja)తో పాటు హీరోయిన్ అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ లు పాల్గొన్నారు. అలాగే వీరితో పాటు నిర్మాత నిరంజన్ రెడ్డి మరియు హనుమాన్ కి పని చేసిన సాంకేతిక నిపుణులందరు పాల్గొన్నారు .అలాగే హనుమాన్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్(jai hanuman) ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.