English | Telugu
జియో హాట్ స్టార్ ఆఫీస్ కి ఊహించని పార్సిల్స్.. రాజా సాబ్ స్ట్రీమింగ్ నే కారణం
Updated : Feb 7, 2026
-ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పనే
-ఎందుకు అలా చేసారు
-నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నారు
నిను వీడని నీడను నేనే.. కలగా మెదిలే కథ నేనే.. ఈ హర్రర్ సాంగ్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్, ప్రముఖ ఓటిటి దిగ్గజం జియో హాట్ స్టార్(Jio Hotstar)మధ్య చక్కర్లు కొడుతుంది. ఇందుకు ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచింది ది రాజాసాబ్(The Raja Saab)మూవీ. అదేంటని అనుకుంటున్నారా! పూర్తి డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు కూడా సదరు సాంగ్ ని హమ్ చేస్తు ప్రభాస్ ఫ్యాన్స్ జియో హాట్ స్టార్ ని వీడేలా లేరని అంటారు. మరి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
రాజాసాబ్ నిన్న ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.దీంతో కొంతమంది అభిమానులు జియో హాట్‌స్టార్ ఆఫీస్‌కి పెద్ద ఎత్తున బిర్యానీ పార్సెల్స్ ఆర్డర్ చేసారు. సదరు ఫుడ్ ఆర్డర్లకి సంబంధించిన ఫోటోలను జియో హాట్‌స్టార్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో పాటు “లవ్వే… లవ్వే… అంతా లవ్వే. థాంక్యూ డార్లింగ్. అందరూ కొట్టి చంపేస్తారు… మీరు మాత్రం పెట్టి చంపేస్తున్నారు” అంటూ సరదా క్యాప్షన్ ఇవ్వడం నెటిజన్లని ఆకట్టుకుంది. దీంతో పాటు సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది.
also read:నువ్వు మాత్రం అలాగే ఉండు దొర.. మనసు మార్చుకోకు
థియేటర్స్ లో రాజాసాబ్ డిజాస్టర్ ని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ బిర్యానీ పంపించడం ఆసక్తిగా మారడంతో పాటు ముందు ముందు మరిన్ని కానుకలు ఇస్తారేమో అనే చర్చ కుడా జరుగుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.