English | Telugu

కళాసామ్రాట్ పొత్తూరి రంగారావుకి డాక్టరేట్!

కళాదర్బార్‌ వ్యవస్థాపకులు,కళాసామ్రాట్ పొత్తూరి రంగారావు (Potturi Rangarao) డాక్టరేట్ ను పొందారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనకు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. సాంస్కృతిక రంగంలో రంగారావు చేసిన సేవలను గుర్తించిన అమెరికన్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను అందించింది.

పొత్తూరి రంగారావు ఐదు దశాబ్దాలుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందరో సినీ ప్రముఖులను సన్మానించారు. పలువురు సినీ దిగ్గజాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకు ఇప్పటికే ఎన్నో అవార్డులు, బిరుదులు పొందారు. ఇప్పుడు డాక్టరేట్ ను అందుకున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.