English | Telugu
పవర్ స్టార్ కి ‘పీపుల్స్ స్టార్’ క్వశ్చన్
Updated : Mar 18, 2015
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి ‘పీపుల్స్ స్టార్’ ఆర్.నారాయణమూర్తి అదిరిపోయే ప్రశ్న వేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడు అని అన్నాడు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల కోసం ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ , తన పార్టీ కోసం ఎప్పుడూ ప్రచారం చేస్తారని అన్నారు. పవన్‌కళ్యాణ్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడోనని ఆయన అభిమానులు ఏంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇదంతా ‘రేయ్’ సినిమాలోని పవనిజం సాంగ్ ఆవిష్కరణ సందర్భంగా జరిగింది. దీంతో పవన్ అభిమానుల్లోనే కాకుండా, ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఈ విషయంపై ఆసక్తి చర్చలు మొదలయ్యాయి.