English | Telugu
కలెక్షన్స్ లో మా వాటా మాకు ఇచ్చేయాలి.. పాకిస్థాన్ ప్రజల డిమాండ్
Updated : Dec 23, 2025
-మా వాటా ఎంతో తెలుసా!
-పాకిస్థాన్ ఏమంటుంది
-ఎంత వచ్చాయి
-లయరీ ని బాగానే వాడారు
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 'ధురంధర్'(Dhurandhar)ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి ప్రీ ప్రిపరేషన్ లో ఉంది. వెయ్యి కోట్ల రూపాయిల కలెక్షన్స్ కి చేరువ కాబోతుండటమే అందుకు ఉదాహరణ. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా 'దురంధర్' పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. అంతలా ధురంధర్ భారీ విజయం వైపు దూసుకెళ్తుంది. ఇందుకు ప్రధాన కారణం నటీనటుల పెర్ఫార్మెన్సుతో పాటు చిత్ర కథ. ముఖ్యంగా పాకిస్థాన్(Pakisthan)లోని కరాచీ(Karachi)లో ఉన్న 'లయరీ'(Lyari)ప్రాంతం కూడా విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఇప్పుడు ఆ లయరీ ప్రాంత ప్రజలు పలు డిమాండ్స్ ని ధురంధర్ మేకర్స్ ముందు ఉంచుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాళ్ళు మాట్లాడుతు 'ధురంధర్ కథ మా ప్రాంతంలో జరిగే కథగా చిత్రీకరించారు కాబట్టి కలెక్షన్స్ లో వాటా ఇవ్వాలి. సదరు వాటా ఎనభై శాతం ఉండాలి. అసలు సగం వాటా ఇవ్వాలి. మేకర్స్ మా ఏరియాలో హాస్పిటల్ కట్టించి ఇవ్వాలి. ఒక వేళ మేకర్స్ ఇవ్వాలనుకున్నా మాకు ఒక రూపాయికి కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఇలా లయరీ కి చెందిన పలువురు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి.
Also read: సిఐడి ఆఫీస్ లో మంచు లక్ష్మి.. రీజన్ ఇదే
లయరీ టౌన్ విషయానికి వస్తే ఒకప్పుడు కరుడుగట్టిన రౌడీయిజానికి పెట్టింది పేరు. రెహ్మాన్ డెకాయిట్ ఒక అసాంఘిక శక్తీ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాడు. ఇండియాలోజరిగే ఉగ్రవాదుల దాడులకి కూడా సాయం చేస్తుంటాడు. దీంతో మన ఇండియన్ రా ఆఫీసర్ మారుపేరుతో డెకాయిట్ దగ్గర పనిలో చేరి కుడి భుజంగ మారతాడు. ఆ తర్వాత అక్కడి లోకల్ పోలీస్ అధికారి, పొలిటికల్ లీడర్ తో కలిసి డెకాయిట్ ని అంతమొందిస్తాడు.దీంతో కథ జరిగే కాలాన్ని బట్టి, క్యారక్టర్ ల మైండ్ సెట్ ని బట్టి లయరీ టౌన్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి టౌన్ ని మేకర్స్ పర్ఫెక్ట్ గా సెట్ తో తీర్చిద్ది అక్కడే కథ జరుగుతున్నట్టుగా మెస్మరైజ్ చేయడం జరిగింది.