English | Telugu

‘ఓం మంగళం మంగళం’ స్టార్ హంట్

సినిమాల్లో నటించాలని, హీరో,హీరోయిన్లుగా తమని తాము వెండితెరపై చూసుకోవాలని చాలామంది కళాకారులు కలలు కంటుంటారు. అలాంటి వారికోసం ప్రముఖ దర్శకుడు మధుర శ్రీధర్ తాజాగా ఓ స్టార్ హంట్ నిర్వహించబోతున్నారు. హార్డ్ వర్క్, టాలెంట్ వుంటే చాలు అని అంటున్నారు శ్రీధర్.

‘స్నేహగీతం’, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’, ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘మాయ’ వంటి పలు చిన్న హిట్ చిత్రాలను అందించిన మధుర శ్రీధర్ ‘ఓం మంగళం మంగళం’ అనే చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా కోసం స్టార్ హంట్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

ఇందుకు ఆసక్తి వున్నా వారు తమ లేటెస్ట్ ఫోటోలను, మరియు ఏదైనా మీకు నచ్చిన డైలాగ్ ను 1నిమిషం మించకుండా చెప్పిన వీడియోను shirdisaicombines@gmail.com అనే మెయిల్ కు పంపించగలరని మధుర శ్రీధర్ తెలియజేశారు. తాజాగా ఇందుకు సంబంధించి ‘ఓం మంగళం మంగళం’ స్టార్ హంట్ కోసం ఓ సాంగ్ ను కూడా విడుదల చేసారు. ఆ వీడియో స్పెషల్ గా మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...