English | Telugu

'రభస' దెబ్బా ఫ్యాన్స్ అబ్బా..!!

జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా కాలమైంది. టాలీవుడ్ లో 50కోట్ల క్లబ్ హావా నడుస్తుంటే దానిని జూనియర్ ఎన్టీఆర్ ఇంత వరకు అందుకోలేదు. మెగా హీరోలు ఒకరి వెనుక ఒకరు 50కోట్ల క్లబ్ లో చేరిపోతుంటే జూనియర్ మాత్రం గత కొంతకాలంగా ఓ మోస్తరు హిట్లతో నేట్టుకువస్తున్నాడు. దీంతో నందమూరి అభిమానులు జూనియర్ కి సింహాద్రిలాంటి హిట్ దక్కాలని 'రభస’పై అంతులేని అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమా ఆడియో మొన్ననే విడుదలైంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటలు అంతంత మాత్రంగా ఉన్నాయని నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్‌ పాడిన ‘రాకాసి రాకాసి’ తప్ప మిగతా అన్ని పాటలు బృందావనం ఆడియో కాపీ కొట్టాడని అంటున్నారు. అసలకే ఇండస్ట్రీ హిట్ రావాలని ఆశగా వున్న అభిమానులని తమన్ ఆదిలోనే నిరాశపరిచాడు. ఇప్పుడు‘రభస’ని బాక్సాఫీస్‌ వద్ద హిట్ చేయాల్సిన భారమంతా డైరెక్టర్, ఎన్టీఆర్‌పైనే వుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.