English | Telugu

టెంపర్ బ్యూటీకి రోడ్డు ప్రమాదం.. మద్యం మత్తులో..!

రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు మనం సవ్యంగా వెళ్తున్నా.. ఒక్కోసారి ఎదుటివారి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి గురవుతుంటాం. తాజాగా ప్రముఖ నటి, డ్యాన్సర్‌ నోరా ఫతేహికి అలాంటి పరిస్థితే ఏమైంది. మద్యం మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్.. నోరా ఫతేహి వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. (Nora Fatehi)

శనివారం ముంబైలో నిర్వహించిన సన్‌బర్న్ ఫెస్టివల్ కి నోరా ఫతేహి వెళ్తుండగా.. ఆమె కారుని మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న నోరా.. కాసేపు విశ్రాంతి తీసుకొని, మళ్ళీ ఆ ఈవెంట్ కి హాజరవ్వడం విశేషం.

ఈ ఘటన గురించి నోరా ఫతేహి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మద్యం మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్ నా వెహికల్ ని ఢీ కొట్టాడు. నా తల కారు విండోకి తగలడంతో గాయాలయ్యాయి. ప్రస్తుతం బాగానే ఉన్నా. వాపు, తల తిరగడం లాంటివి ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ని ఎవరూ ప్రోత్సహించవద్దని కోరుతున్నాను. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల.. ప్రమాదాలు జరిగి ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు." అని నోరా ఫతేహి అన్నారు.

కాగా, ప్రత్యేక గీతాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోరా ఫతేహి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'టెంపర్'లో 'ఇట్టాగే రెచ్చిపోదాం', 'బాహుబలి'లో 'మనోహరి', 'ఊపిరి'లో 'డోర్ నెంబర్ ఒకటి' వంటి పాటల్లో చిందేసింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.