English | Telugu
మహేష్ శ్రీమంతుడులో నయనతార
Updated : Jul 30, 2015
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు సడన్ గా ఈ సినిమాలో నయనతార ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? ఇది వేరే మేటర్లేండి. నయనతార కథానాయికగా నటించిన `మయూరి` ట్రైలర్ ను శ్రీమంతుడు థియేటర్లలో ప్రదర్శించబోతున్నారట. అది మ్యాటర్.
నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకుడిగా తమిళంలో `మాయ` అనే చిత్రం తెరకెక్కింది. అదే చిత్రం తెలుగులో `మయూరి`గా విడుదల కాబోతోంది. ఇందులో నయనతార దెయ్యంగా కనిపించబోతోందట. రెండు భాషల్లోనూ సినిమాని తీశారు. తెలుగు వర్షన్ కి సి.కళ్యాణ్ నిర్మాత. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. ఆగస్టు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ సినిమాని విడుదల చేస్తారు. మహేష్ తో పాటు ట్రైలర్ వస్తోంది కాబట్టి `మయూరి`కి మంచి పబ్లిసిటీనే దక్కబోతోంది.