English | Telugu
పవన్ కళ్యాణ్ ఓజి కి నారా రోహిత్ కాబోయే భార్య శిరీష కి సంబంధం ఏంటి!
Updated : May 29, 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్,(sai Srinivas)మంచు మనోజ్(Manchu Manoj),నారా రోహిత్(Nara Rohith)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'భైరవం'(Bhairavam) ప్రముఖ అగ్ర దర్శకుడు శంకర్(Shankar)కూతురు అదితి(adithi)శంకర్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమవుతుంది. విజయ్ కనకమేడల(VIjay Kanakamedala) దర్శకత్వంలో కె కె రాధా మోహన్ నిర్మిస్తుండగా, ఈ నెల 30 న అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది.
ఈ మేరకు జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్ ని మరో హీరో సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ తో తేజ్ మాట్లాడుతు ఓజి అప్ డేట్ చెప్పమని అడిగాడు. దాంతో రోహిత్ సమాధానం ఇస్తు ఓజి లో నాకు కాబోయే భార్య శిరీష నటించింది. ఒక కీలక పాత్రల్లో కనిపించే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు.
హరిహర వీరమల్లు తర్వాత పవన్(Pawan Kalyan)నుంచి ప్రేక్షకుల ముందుకు ఓజి(Og)నే రానుంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తికానుంది.ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఆర్ ఆర్ఆర్ ఫేమ్ దానయ్య నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది.